Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:19 AM

నూజివీడు లో రూ.25 లక్షల రూపాయలతో రజక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన

22-02-2026 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మంత్రి హామీ: రజకుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం

నూజివీడు పట్టణంలోని వెలమపేట రెండవ వార్డులో సుమారు రూ.25 లక్షల వ్యయంతో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ వర్గాల సంక్షేమానికి సుమారు రూ.52 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

బీసీ వర్గాల సంప్రదాయ కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తూ, చేతివృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

నూజివీడు నియోజకవర్గ పరిధిలోని అన్ని సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. బీసీ కమ్యూనిటీ హాళ్లకు రూ.50 లక్షలు, ఇతర కమ్యూనిటీ హాళ్లకు రూ.30 నుంచి రూ.50 లక్షల వరకు కేటాయించి త్వరలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కాపు కమ్యూనిటీ హాల్ కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు.

రజకుల ప్రధాన సమస్యలలో ఒకటైన ధోబీఘాట్ విద్యుత్ బిల్లులపై రాయితీ కల్పనకు కృషి చేస్తామని, జీవో నెంబర్ 111 అమలు దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ, జెడ్పీటీసీ స్థానాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు డి. రామారావు, తిరుమల తిరుపతి డైరెక్టర్ డి. శ్రీనివాసరావు, రజక సంఘ నాయకులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

నూజివీడు లో రూ.25 లక్షల రూపాయలతో రజక కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News