Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:09 PM

నూరు శాతం పోలింగ్ లక్ష్యంగా కలెక్టర్ ఉత్తర్వులు

09-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపాలిటీ ఎన్నికల్లో నూరు శాతం పోలింగ్ సాధించడమే లక్ష్యంగా ఈ నెల 11న జరగనున్న పోలింగ్ రోజున స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ జరిగే రోజు ఈ నెల 11న ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు సాధారణ సెలవు ప్రకటించారు. ఎన్నికల ప్రాంతాల్లోని దుకాణాలు, సంస్థలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వేతనంతో కూడిన సెలవు కల్పించాలని స్పష్టం చేశారు.ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థల భవనాలకు ఈ నెల 10న పోలింగ్‌కు ముందు రోజు, 11న పోలింగ్ రోజు, 13న ఓట్ల లెక్కింపు రోజున సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు.

ఈ ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఓటరు పోలింగ్ రోజున తప్పకుండా తన విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Sthanikam

నూరు శాతం పోలింగ్ లక్ష్యంగా కలెక్టర్ ఉత్తర్వులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News