Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:26 PM

నిరుపేద కుటుంబానికి రూ.10,116 ఆర్థిక సాయం అందించిన ఓర్సు రాజకుమార్

08-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం పెద్దకాపర్తి తిరుమలనాథ స్వామి దేవస్థానం చైర్మన్ ఓర్సు రాజకుమార్ మాటకు కట్టుబడి, పేద ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడమే నిజమైన నాయకత్వ లక్షణమని మరోసారి నిరూపించుకున్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి ఆయన ఆర్థిక సహాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు.గ్రామానికి చెందిన ఓర్సు రాజు కుమార్తె వివాహానికి గతంలో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు, రాజకుమార్ తన వంతు సహాయంగా రూ.10,116 నగదును అందజేశారు. శుక్రవారం పెద్దకాపర్తి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ మొత్తాన్ని కుటుంబానికి అందించారు.ఈ సందర్భంగా చిట్యాల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దకాపర్తి ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, ఏర్పుల నరసింహ, శిరస్సు రవి, ఓర్సు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేద కుటుంబానికి రూ.10,116 ఆర్థిక సాయం అందించిన ఓర్సు రాజకుమార్

Article Image

చిట్యాల మండలం పెద్దకాపర్తి తిరుమలనాథ స్వామి దేవస్థానం చైర్మన్ ఓర్సు రాజకుమార్ మాటకు కట్టుబడి, పేద ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడమే నిజమైన నాయకత్వ లక్షణమని మరోసారి నిరూపించుకున్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి ఆయన ఆర్థిక సహాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు.గ్రామానికి చెందిన ఓర్సు రాజు కుమార్తె వివాహానికి గతంలో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు, రాజకుమార్ తన వంతు సహాయంగా రూ.10,116 నగదును అందజేశారు. శుక్రవారం పెద్దకాపర్తి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ మొత్తాన్ని కుటుంబానికి అందించారు.ఈ సందర్భంగా చిట్యాల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దకాపర్తి ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, ఏర్పుల నరసింహ, శిరస్సు రవి, ఓర్సు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News