Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

నిరుపేద కుటుంబాలకు అండగా ఖేడ్ ముస్లిం కమిటీ

18-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ ముస్లిం కమిటీ తరపున నిరుపేద కుటుంబాలకు మానవతా సహాయం అందించారు.ఇటీవల నారాయణఖేడ్ పట్టణంలో వాషింగ్ సెంటర్‌లో పనిచేస్తూ ఓ యువకుడు హఠాత్తుగా మృతి చెందగా,ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు కమిటీ ముందుకు వచ్చింది.ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి ఖేడ్ ముస్లిం కమిటీ తరఫున రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు.అలాగే నిరుపేద కుటుంబానికి చెందిన ఓ ఆడపడుచు వివాహానికి రూ.20,000, మరో నిరుపేద కుటుంబానికి చెందిన ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ.5,000 సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణఖేడ్ మాజీ చైర్‌పర్సన్ అనంత్ స్వరూప్ శెట్కార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ,అవసరంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఎల్లప్పుడూ ఖేడ్ ముస్లిం కమిటీ అండగా ఉంటుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖేడ్ ముస్లిం కమిటీ అధ్యక్షులు వసీం కతీబ్, వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఫిరోజ్, అక్బర్ ఖాన్, ముక్రం ఖాన్, జాయింట్ సెక్రటరీ ఇసాక్,ఇమ్రాన్ ఖాధిబ్,ఎండి ఇస్మాయిల్, ఫైయాజ్ హాసమ్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేద కుటుంబాలకు అండగా ఖేడ్ ముస్లిం కమిటీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News