Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:15 AM

నిరుద్యోగులకు ఆశాకిరణంగా కుంభం ఫౌండేషన్ జాబ్ మేళా

09-05-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారీగా తరలివచ్చిన యువత.. కీర్తిరెడ్డి కృషి అభినందనీయం

భువనగిరి, : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. వన్ మిలియన్ వన్ బిలియన్ సంస్థ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది యువతీ యువకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కుంభం ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తిరెడ్డిని పోత్నక్ ప్రమోద్‌కుమార్ ఘనంగా సన్మానించారు. అనంతరం కీర్తిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా, భువనగిరి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఈ జాబ్ మేళా సువర్ణావకాశమని పేర్కొన్నారు.

సుమారు 2 వేల మంది యువతీ యువకులు పాల్గొని తమ విద్యార్హత సర్టిఫికెట్లను ధృవీకరించుకున్నారని తెలిపారు. ఈ నెల 10న నిర్వహించే ఇంటర్వ్యూలలో దాదాపు 20 కంపెనీలు పాల్గొని అభ్యర్థుల కమ్యూనికేషన్ స్కిల్స్, విద్యార్హతల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

న్యూ డైమెన్షన్స్ హైస్కూల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం భోజనాలు, మంచినీటి సదుపాయం తదితర మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ఎండాకాలం తీవ్రత ఉన్నప్పటికీ భారీ సంఖ్యలో యువత హాజరవడం నిరుద్యోగ సమస్య తీవ్రతకు నిదర్శనమన్నారు.

ప్రభుత్వాలు మాత్రమే అన్ని ఉద్యోగాలను కల్పించడం సాధ్యం కాదని, ఇలాంటి సంస్థలు ముందుకు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కౌన్సిలర్ లయిక్ అహ్మద్, మదర్ పాషా, బబ్లు, పడిగేల ప్రదీప్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాటూరు బాలేశ్వర్, పిట్టల బాలరాజ్, పుట్ట శివ, సందీప్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుద్యోగులకు ఆశాకిరణంగా కుంభం ఫౌండేషన్ జాబ్ మేళా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News