Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:31 AM

నిధులు ఉన్నా... రోగులకు తప్పని తిప్పలు నిధులున్నా నిరూపయోగం సూపరింటెండెంట్ ఇష్టారాజ్యం

03-06-2026 173 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రోగుల ఇబ్బందులు పట్టని పాలకులు

రామన్నపేట,

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిగా మారింది హాస్పిటల్ తీరు. నిధులున్నా రోగులకు సౌకర్యాలు కల్పిపించడంలో సూపరింటెండెంట్ వ్యవహారిస్తున్న తీరును పలువురు ప్రశ్నిస్తున్నారు.

మౌలిక సదుపాయాలేవి

రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలపై పాలకులు, సూపరింటెండెంట్ పట్టించుకోవడంలేదు. ఆస్పత్రిలో దెబ్బతిన్న స్విచ్‌బోర్డులు, పనిచేయని ఏసీలు, మహిళల వార్డుల్లో కూలర్లు లేకపోవడం వంటి సమస్యలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు సమస్యలను గాలికొదిలేయడం బాధాకరమని అంటున్నారు.

మహిళల వార్డుల్లో ఒక్క కూలర్ కూడా లేకపోవడంతో గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లల వార్డులో ఏసీ పనిచేయకపోవడంతో చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉక్కపోత వాతావరణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అద్దెలు వసూలు చేసినా

ఆస్పత్రికి మడిగల అద్దెలు వసూలు చేసినా వాటిని ఖర్చు చేయడంలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 16 వరకు రూ.40 లక్షలకు పైగా ఆదాయం వచ్చినప్పటికీ, ఆ నిధులను రోగుల సౌకర్యాల కోసం ఎందుకు వినియోగించడం లేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ అందుబాటులో ఉన్నప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడం వెనుక కారణాలేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రజల సమస్యలను మీడియా ద్వారా వెలుగులోకి తీసుకొచ్చినా స్పందన లేకపోవడం, రోగుల ఇబ్బందులను పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Sthanikam

నిధులు ఉన్నా... రోగులకు తప్పని తిప్పలు నిధులున్నా నిరూపయోగం సూపరింటెండెంట్ ఇష్టారాజ్యం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News