Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:24 AM

నేటి నుంచి ఉప్పల్‌ రింగ్‌రోడ్డు మూసివేత

నేటి నుంచి ఉప్పల్‌ రింగ్‌రోడ్డు మూసివేత

నేటి నుంచి ఉప్పల్‌ రింగ్‌రోడ్డు మూసివేత
17-05-2026 137 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌, ప్రతినిధి: ఉప్పల్‌–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల నేపథ్యంలో నేటి నుంచి ఉప్పల్‌ రింగ్‌రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మూడు నెలల పాటు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.

రామంతాపూర్‌, హబ్సిగూడ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు పిస్తా హౌస్‌, లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక నుంచి బీరప్పగడ్డ మీదుగా వరంగల్ జాతీయ రహదారిని చేరుకోవాల్సి ఉంటుంది.

నాగోల్‌, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు హయాత్‌నగర్ మీదుగా పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు లేదా సర్వీస్ రోడ్డుమార్గంగా ఘట్‌కేసర్ వద్ద జాతీయ రహదారిని చేరుకోవాలని సూచించారు.

పీర్జాదిగూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఉప్పల్ జంక్షన్‌కు ముందున్న లక్ష్మారెడ్డి కాలనీ మీదుగా వెళ్లి ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ వద్ద యూ టర్న్ తీసుకుని ప్రయాణించాల్సి ఉంటుంది.

పీర్జాదిగూడ నుంచి నాగోల్ వెళ్లే వాహనాలు ఉప్పల్ భాగాయత్ లేఔట్ మార్గాన్ని వినియోగించుకోవాలని, నాగోల్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు కూడా ఇదే మార్గంలో వెళ్లాలని అధికారులు తెలిపారు.

హబ్సిగూడ నుంచి నాగోల్ వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు.

Sthanikam

నేటి నుంచి ఉప్పల్‌ రింగ్‌రోడ్డు మూసివేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News