Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:57 AM

నేత్రపర్వంగా శ్రీ సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం

26-03-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అలంకార్ బజార్‌లో వైభవంగా ప్రారంభమైన వార్షికోత్సవాలు

శ్రీరామనవమి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అలంకార్ బజార్‌లో శ్రీ సీతారామ వసంత కళ్యాణ మహోత్సవం నలభై తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక గీత మందిరం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకొచ్చి కలశ స్థాపన పూజలు నిర్వహించారు. అనంతరం పసుపు దంచి వేడుకలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం నిర్వహించిన శ్రీ సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం భక్తులను ఆకట్టుకుని నేత్రపర్వంగా నిలిచింది. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మీలా మహదేవ్ మాట్లాడుతూ అలంకార్ బజార్‌లో అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తోట శ్యాంప్రసాద్, కోశాధికారి మురారిశెట్టి శ్రీదర్, ఉపాధ్యక్షులు కాసం జగన్, గుడిపాటి సురేష్, గోదల మల్లారెడ్డి, వీర్లపాటి రమేష్, తోట రాజగోపాల్, వీర్లపాటి విజయ్, సంయుక్త కార్యదర్శులు పోతుగంటి మనోహర్, బూర్ల మధు, రజనీకాంత్, ఏకాంబరం, జూలకంటి ఉదయ్ తదితరులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

నేత్రపర్వంగా శ్రీ సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News