Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

నీట్‌ పేపర్‌ లీక్‌పై యువజన కాంగ్రెస్ నిరసన

13-05-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మోదీ ఫ్లెక్సీ దహనం.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్

చౌటుప్పల్ మండల కేంద్రంలో నీట్‌–2026 పరీక్ష పేపర్‌ లీక్‌ జరిగినట్లు నిర్ధారణ కావడంతో పరీక్ష రద్దు చేసిన నేపథ్యంలో బుధవారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ భార్గవ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సంఘీభావంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్లెక్సీ ఫోటోను దహనం చేసి ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోషిక వినయ్, నియోజకవర్గ అధ్యక్షుడు అబ్బనబోయిన రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో 89 పరీక్షల పేపర్లు లీక్ కావడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. నీట్‌ పేపర్‌ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లీకేజీ వెనుక ఎంత పెద్ద నాయకుల హస్తం ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జాల మణికంఠ యాదవ్, నారాయణపురం మండల అధ్యక్షుడు రెడ్యానాయక్, మండల కమిటీ కార్యదర్శులు పబ్బతి వెంకటేష్, ఆవుల రాజు, చింతల శివ, సీనియర్ నాయకులు పెద్దగోని రమేష్ గౌడ్, మాజీ టౌన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చెరుకు లింగస్వామి, యువజన కాంగ్రెస్ నాయకులు తొర్పునూరి రవి గౌడ్, తీగుల్ల రాఘవేంద్ర, చింతకింది గణేష్, యాట సంతోష్, ముజాయిద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నీట్‌ పేపర్‌ లీక్‌పై యువజన కాంగ్రెస్ నిరసన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News