Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:08 AM

నీట్ లీకేజీపై సీపీఎం నిరసన. విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని కేంద్రానికి హెచ్చరిక

14-05-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

నీట్ పరీక్ష నిర్వహణలో జరుగుతున్న వైఫల్యాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గురువారం స్థానిక సుభాష్ సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం మాట్లాడుతూ “ఒకే దేశం–ఒకే పరీక్ష” పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం రాజ్యాంగ సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందన్నారు. విద్యారంగాన్ని రాష్ట్రాల పరిధిలో ఉంచకుండా కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు.

రాజస్థాన్‌లో జరిగిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు కూరల నరసింహాచారి, కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు, తొలుపునూరి శ్రీనివాస్, నీల అయిలయ్య, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గడ్డపాక శివకుమార్, డీవైఎఫ్‌ఐ మండల కార్యదర్శి మెట్టు శ్రవణ్‌కుమార్, పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్, పల్లె సత్యం, బావాండ్లపల్లి సత్యం, గట్టు ఉపేందర్, గంజి అశోక్, అప్పం సంతోష్, తరిగొప్పుల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నీట్ లీకేజీపై సీపీఎం నిరసన. విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని కేంద్రానికి హెచ్చరిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News