Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:25 AM

నీట్ లీక్‌పై రామన్నపేటలో యువజన కాంగ్రెస్ ఆగ్రహ జ్వాలలు

14-05-2026 119 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం.. రామన్నపేటలో ఉద్రిక్తత

నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ హయాంలో వరుసగా పేపర్ లీకులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గత పదేళ్లలో 89 పేపర్ లీకులు చోటుచేసుకోగా 48 సార్లు మళ్లీ పరీక్షలు నిర్వహించడం దారుణమని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, కాంగ్రెస్ నాయకులు వనం చంద్రశేఖర్, కోట సుధాకర్, కేశవదాసు వెంకటేష్, బొడ్డు సురేందర్‌రావు, ఏటెల్లి పరమేష్, చల్లా సత్యప్రకాష్, బండ లింగస్వామి, ఇనాయతుల్లా బైగ్, గుండాల సతీష్, పెరమల్ల నవీన్, తెల్ల శేఖర్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు బైరబోయిన శోభా, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కల్లూరి శివ, కందగట్ల రాహుల్, నాయకులు పల్లపు రవి, జవ్వాజి శ్రీకాంత్, కన్నెబోయిన రవీందర్, సింగరాజు యశ్వంత్, అంజద్, అజార్, కందుల మణి, నల్లబాల శరత్, సుర్వి మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నీట్ లీక్‌పై రామన్నపేటలో యువజన కాంగ్రెస్ ఆగ్రహ జ్వాలలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News