Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:17 AM

నీట్‌ అవ్యవస్థలతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం ఎన్‌టీఏను రద్దు చేయాలి: డీవైఎఫ్‌ఐ

12-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ

నీట్‌ పరీక్షల్లో వరుసగా జరుగుతున్న అవ్యవస్థలు, పేపర్‌ లీక్‌లతో దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్‌ అన్నారు. ఎన్‌టీఏను వెంటనే రద్దు చేసి పారదర్శకమైన కొత్త పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

మంగళవారం నల్గొండలో నిర్వహించిన డీవైఎఫ్‌ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సంవత్సరాల పాటు కష్టపడి చదివిన విద్యార్థుల కలలు పేపర్‌ లీక్‌ల కారణంగా ఛిన్నాభిన్నం అవుతున్నాయన్నారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లలను చదివిస్తుంటే పరీక్షల నిర్వహణలో అవినీతి, భద్రతా లోపాలు వారి ఆశలను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఎన్‌టీఏ నిర్వహించిన పలు పరీక్షలు లీకేజీకి గురయ్యాయని, అయినా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదన్నారు.

నీట్‌ పేపర్‌ లీక్‌లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు.

సమావేశంలో డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లెంల శ్రీకర్‌, పతాని శ్రీను, గుండాల నరేష్‌, కట్ట లింగస్వామి, పోకల శశిధర్‌, పాలది కార్తీక్‌, కండె యాదగిరి, తరి రామకృష్ణ, ఏడుకొండలు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నీట్‌ అవ్యవస్థలతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం ఎన్‌టీఏను రద్దు చేయాలి: డీవైఎఫ్‌ఐ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News