Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఘనంగా

07-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ భవన్‌లో శనివారం రమాబాయి అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంతో ఆత్మీయంగా, ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మాట్లాడుతూ రమాబాయి అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు,మహిళా సాధికారత కోసం ఆమె చేసిన పోరాటం అనితర సాధ్యమని కొనియాడారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో రమాబాయి అంబేద్కర్ పాత్ర మరువలేనిదని ఆయన పేర్కొన్నారు.సామాజిక సమానత్వం,న్యాయం కోసం ప్రతి ఒక్కరూ ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, న్యాల్‌కల్ మండల అధ్యక్షులు నవీన్ కుమార్, కమిటీ సభ్యులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. కార్యక్రమం చివర్లో రమాబాయి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలనే సంకల్పాన్ని పాల్గొన్నవారు వ్యక్తం చేశారు.

Sthanikam

నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఘనంగా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News