Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:11 PM

నీరు లేక నిట్టనిలువునా ఎండిన వరి… అన్నదాత ఆవేదన

17-03-2026 172 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ల వెల్లంలలో సాగునీటి ఎద్దడి దారుణం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్ల వెల్లంల గ్రామంలో సాగునీటి కొరత రైతులను తీవ్రంగా కుదిపేస్తోంది. బోర్లపై ఆధారపడి సాగు చేసిన వరి పంటలు కంకి దశలోనే ఎండిపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఒకటిన్నర ఎకరాల్లో వరి సాగు చేసిన మహిళా కౌలు రైతు ఆనంతుల పార్వతమ్మ పరిస్థితి ఈ ప్రాంత రైతుల దుస్థితిని ప్రతిబింబిస్తోంది.

భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో పంట నిట్టనిలువునా ఎండిపోగా, చివరకు పశువుల మేపుకే వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. పంటను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ట్యాంకర్‌కు రూ.800 చొప్పున నీరు కొనుగోలు చేసి పొలానికి పోశినా ఫలితం లేకపోవడంతో పెట్టుబడంతా వృథా అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ప్రాంతంలో కాలువలకు నీరు రాకపోవడం, బోర్లు ఎండిపోవడం వల్ల పచ్చని పొలాలు ఎడారిలా మారుతున్నాయి. చేతికొచ్చే దశలో ఉన్న పంటలు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రభుత్వ సాయం సకాలంలో అందకపోవడం, పెట్టుబడులు తిరిగి రాకపోవడం వల్ల అప్పుల భారంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో తమకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. ఉదయ సముద్రం నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామ చెరువులోకి నీటిని మళ్లిస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొంటున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

నీరు లేక నిట్టనిలువునా ఎండిన వరి… అన్నదాత ఆవేదన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News