Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:16 PM

నేరేడుచర్లను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

నేరేడుచర్లను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

నేరేడుచర్లను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
January 20, 2026 05:10 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మూడేళ్లలో సమగ్ర అభివృద్ధి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

రానున్న మూడేళ్లలో నేరేడుచర్ల మున్సిపాలిటీని సమగ్ర అభివృద్ధితో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టిగా చెప్పారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పాలన సాగించడమే తన ప్రజాజీవిత సంకల్పమని స్పష్టం చేశారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారు.మహిళా శక్తికి ఆర్థిక భరోసామున్సిపల్ పరిధిలోని నాలుగు వందల నాలుగు స్వయం సహాయక మహిళా సంఘాలకు యాభై రెండు లక్షల ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను మంత్రి అందజేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఐదు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడుతూ ప్రభుత్వమే అండగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. తాను ప్రజాజీవితాన్ని తపస్సులా సాగిస్తున్నానని, పాలనలో తీసుకునే ప్రతి నిర్ణయం పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతోనే ఉంటుందని మంత్రి అన్నారు.

మిర్యాలగూడ నుంచి నేరేడుచర్ల, కోదాడ మీదుగా ఖమ్మం వరకు జాతీయ రహదారి నిర్మాణాన్ని గతంలో తానే చేపట్టినట్లు గుర్తు చేశారు. హుజూర్నగర్‌లో ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలతో జూనియర్ కళాశాల, నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలతో డిగ్రీ కళాశాల భవనాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో సిటీ స్కాన్, డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నిరుద్యోగులకు ఉద్యోగమే లక్ష్యం హుజూర్నగర్‌లో నిర్వహించిన మెగా ఉద్యోగ మేళాల్లో నలభై వేల మంది నమోదు కాగా, నాలుగు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు లభించాయని మంత్రి వెల్లడించారు. యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.

పేదల పళ్లెంలో సన్నబియ్యం. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు దొడ్డు బియ్యం స్థానంలో నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందిస్తున్నామని స్పష్టం చేశారు. వడ్డీ లేని రుణాలు మహిళలకు పెద్ద అండ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఆర్థికంగా పెద్ద భరోసా అని అన్నారు. బ్యాంకు అనుసంధాన రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఇందిరమ్మ చీరలను అర్హులైన మహిళలకు పారదర్శకంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా ఎస్పీ కే. నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి, ఉప చైర్మన్ సురేష్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News