Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:27 AM

నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు వెంటనే చైర్మన్‌ నియమించాలి.

12-05-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ హామీలు అమలు చేయాలి: చెన్నారం మల్లేష్‌

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు వెంటనే చైర్మన్‌ను నియమించాలని క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నారం మల్లేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో క్షౌర వృత్తిదారుల సమస్యలపై నిర్వహించిన గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశం వేముల దయాకర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చెన్నారం మల్లేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన తమకు తగిన వాటా కల్పించాలని కోరారు.

నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు చైర్మన్‌తో పాటు ప్రతి జిల్లాకు డైరెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ వృత్తిదారులపై సామాజిక వివక్ష, దాడులు జరుగకుండా వృత్తి రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

క్షౌర వృత్తిదారులు కేవలం కేశాలంకరణకే పరిమితం కాకుండా మంగళ వాయిద్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. ఆధునిక పరికరాలపై అవగాహన కల్పించడంతో పాటు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.

వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాట కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్షౌర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల సైదులు, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చెన్నారపు సత్తయ్య, గ్రామ నాయకులు వేముల దుర్గయ్య, రాము, నరేష్‌, మచ్చగిరి, అనిల్‌, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు వెంటనే చైర్మన్‌ నియమించాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News