Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 10:42 PM

న్యాయవాదులతో సమావేశం

న్యాయవాదులతో సమావేశం

న్యాయవాదులతో సమావేశం
06-02-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మధిర మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు కోరిన నాయకులు

ఖమ్మం జిల్లా మధిర: మధిర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మధిర పట్టణంలోని న్యాయవాదులతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కోండబాల కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు వాసిరెడ్డి రామనాధం సమావేశమయ్యారు. ఈ సమావేశం గురువారం మధిర మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించారు.ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని న్యాయవాదులను కోరారు. అధికార పార్టీకి అండగా నిలిస్తే ప్రజల సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని అన్నారు.మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు న్యాయవాదులు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చి చర్చించారు.

Sthanikam

న్యాయవాదులతో సమావేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News