భువనగిరి జిల్లా కోర్టును రామన్నపేటకు తరలించే ప్రతిపాదనకు నిరసనగా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నిసంగి విద్యాసాగర్ మాట్లాడుతూ, కనీస మౌలిక సదుపాయాలు లేని రామన్నపేటకు కోర్టును తరలించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు.ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించి, గౌరవ ముఖ్య న్యాయమూర్తిని కలిసి తమ అభ్యంతరాలను తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. కోర్టు తరలింపును వ్యతిరేకిస్తున్న న్యాయవాదుల పక్షాన తాము బలంగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేడబోయిన యాదగిరి,శారదా బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 10, 2026 05:25 AM
న్యాయవాద విధులు బహిష్కరణ-నిసంగి విద్యా సాగర్

08-04-2026
24 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
భువనగిరి జిల్లా కోర్టును రామన్నపేటకు తరలించే ప్రతిపాదనకు నిరసనగా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నిసంగి విద్యాసాగర్ మాట్లాడుతూ, కనీస మౌలిక సదుపాయాలు లేని రామన్నపేటకు కోర్టును తరలించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు.ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించి, గౌరవ ముఖ్య న్యాయమూర్తిని కలిసి తమ అభ్యంతరాలను తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. కోర్టు తరలింపును వ్యతిరేకిస్తున్న న్యాయవాదుల పక్షాన తాము బలంగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేడబోయిన యాదగిరి,శారదా బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి