Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:25 AM

న్యాల్కల్‌లో సంధి వివాదం ముదిరింది.. పైపులు తొలగించి హామీ మరిచిన శివశంకర్

24-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని 5వ వార్డ్ శ్రీ రామ్ నగర్ కాలనీలో సంధి, మేనమాల, డ్రైనేజ్ పైపుల అంశంపై తీవ్ర వివాదం చెలరేగింది. స్థానికులకు చెందిన సున్నపు శివశంకర్ కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టే సమయంలో జేసీబీ సహాయంతో అక్కడ ఉన్న పాత పైపులను పూర్తిగా తొలగించినట్లు కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.ఆ సమయంలో తొలగించిన పైపులకు బదులుగా కొత్త పైపులు వేస్తానని శివశంకర్ హామీ ఇచ్చినప్పటికీ, ఏడు నెలలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో వర్షాకాలంలో మురుగు నీరు నిల్వ ఉండటం, రాకపోకలకు ఇబ్బందులు కలగడం వంటి సమస్యలు తీవ్రంగా మారాయని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదే విషయంపై బిచ్చి రెడ్డి కుటుంబానికి చెందిన పద్మావతి ప్రశ్నించగా, ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసినట్లు సమాచారం. కొంతసేపు కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, స్థానికులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేసినట్లు తెలిసింది.ఈ సమస్యపై పలుమార్లు గ్రామపంచాయతీ కార్యాలయానికి ఫిర్యాదులు చేసినప్పటికీ గ్రామపంచాయతీ సెక్రెటరీ శ్రీకాంత్ రెడ్డి స్పందించడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చిన్న సమస్య పెద్ద వివాదంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ప్రస్తుతం ఈ ఘటన న్యాల్కల్ మండల కేంద్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

న్యాల్కల్‌లో సంధి వివాదం ముదిరింది.. పైపులు తొలగించి హామీ మరిచిన శివశంకర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News