Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:26 AM

న్యాల్కల్‌లో పశు వైద్య సంరక్షణ శిబిరం

న్యాల్కల్‌లో పశు వైద్య సంరక్షణ శిబిరం

న్యాల్కల్‌లో పశు వైద్య సంరక్షణ శిబిరం
10-02-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

పశువుల ఆరోగ్యం మెరుగైతే రైతు బతుకు బాగుంటుంది

న్యాల్కల్ మండలం రామతీర్థం గ్రామంలో పశు వైద్య సంరక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో పశు వైద్యుడు డాక్టర్ గణేష్ పశువులకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. ముఖ్యంగా గేదెలు, ఆవులు, దూడలకు సంబంధించిన వ్యాధులు, టీకాల అవసరం, ఆహార నియమాలు, శుభ్రత వంటి అంశాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.

పశువుల ఆరోగ్యం బాగుంటేనే రైతుల ఆదాయం పెరుగుతుందని, పాల ఉత్పత్తి మెరుగవుతుందని డాక్టర్ గణేష్ వివరించారు. కాలానుగుణంగా టీకాలు వేయించుకోవడం, పోషకాహారం అందించడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మమ్మ మాట్లాడుతూరైతుల జీవనాధారమైన పశువుల సంరక్షణకు ఇలాంటి శిబిరాలు ఎంతో అవసరమని అన్నారు.

భవిష్యత్తులో కూడా పశు వైద్య శాఖ సహకారంతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పశువులకు వైద్య సేవలు పొందారు. ఇలాంటి పశు వైద్య సంరక్షణ కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని రైతులు కోరారు.

Sthanikam

న్యాల్కల్‌లో పశు వైద్య సంరక్షణ శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News