Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:24 AM

న్యాల్కల్‌లో ఇందిరమ్మ ఇళ్ల జోరు 650 ఇండ్ల మంజూరుతో పేద కుటుంబాల్లో కొత్త వెలుగులు

13-05-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్ మండలంలో ఇందిరమ్మ గృహలక్ష్మి పథకం పేద కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. సొంత ఇంటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆశాకిరణంగా నిలుస్తోంది. మండల వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతుండగా, గ్రామాల్లో అభివృద్ధి కొత్త దిశగా సాగుతోంది.జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు గౌరవప్రదమైన జీవితం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ గృహలక్ష్మి పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే న్యాల్కల్ మండలానికి 650 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, రానున్న జూన్ నెలలో మరిన్ని అర్హులైన పేద కుటుంబాలకు ఇండ్ల మంజూరు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం సమన్వయంతో వేగంగా పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.బుధవారం “ప్రజా పాలన ప్రగతి నివేదిక” కార్యక్రమంలో భాగంగా న్యాల్కల్ గ్రామానికి చెందిన నరసప్ప (గొలుగూర్) ఇందిరమ్మ గృహాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, న్యాల్కల్ సహకార సంఘం చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిద్ధి లింగయ్య స్వామి మాట్లాడుతూ.. న్యాల్కల్ గ్రామానికి 80 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించగా, ప్రస్తుతం 45 ఇండ్ల నిర్మాణాలు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 9 ఇండ్లు పూర్తయ్యాయని, మరికొన్ని ఇళ్లు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. పేదలకు సొంత ఇంటి కలను నిజం చేస్తూ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.గ్రామాల్లో పక్కా ఇళ్ల నిర్మాణాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని, అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో న్యాల్కల్ మండలం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గృహలక్ష్మి కమిటీ అధ్యక్షుడు అడివప్ప, నాయకులు ప్రవీణ్ కుమార్, చంద్రప్ప, అంజి, కాశీనాథ్, విజయ్, బద్రు స్వామి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

న్యాల్కల్‌లో ఇందిరమ్మ ఇళ్ల జోరు 650 ఇండ్ల మంజూరుతో పేద కుటుంబాల్లో కొత్త వెలుగులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News