Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:28 AM

న్యాల్కల్‌లో బంజారా భవన్‌కు కృషి : మాజీ చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి

16-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్ మండల కేంద్రంలో బంజారా భవన్ (సేవాలాల్ సామూహిక భవనం) నిర్మాణానికి కృషి చేస్తామని న్యాల్కల్ సహకార సంఘం మాజీ చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి తెలిపారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొని ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. స్థానిక ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి భవన నిర్మాణానికి చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.మండల సేవాలాల్ మహారాజ్ సంగం ఆధ్వర్యంలో అధికార పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు సక్కులాల్, రుక్మాపూర్ గ్రామ సర్పంచ్ సురేష్‌కుమార్ నేతృత్వంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. న్యాల్కల్ ఆర్టీసీ బస్టాండ్ నుండి శివాజీ మహారాజ్ కూడలి వరకు భారీ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి – ప్రవీణ్‌కుమార్‌తో పాటు పలువురు సేవాలాల్ భక్తులు శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.

Sthanikam

న్యాల్కల్‌లో బంజారా భవన్‌కు కృషి : మాజీ చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి

Article Image

న్యాల్కల్ మండల కేంద్రంలో బంజారా భవన్ (సేవాలాల్ సామూహిక భవనం) నిర్మాణానికి కృషి చేస్తామని న్యాల్కల్ సహకార సంఘం మాజీ చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి తెలిపారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొని ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. స్థానిక ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి భవన నిర్మాణానికి చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.మండల సేవాలాల్ మహారాజ్ సంగం ఆధ్వర్యంలో అధికార పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు సక్కులాల్, రుక్మాపూర్ గ్రామ సర్పంచ్ సురేష్‌కుమార్ నేతృత్వంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. న్యాల్కల్ ఆర్టీసీ బస్టాండ్ నుండి శివాజీ మహారాజ్ కూడలి వరకు భారీ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి – ప్రవీణ్‌కుమార్‌తో పాటు పలువురు సేవాలాల్ భక్తులు శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News