Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:25 AM

న్యాల్కల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి

02-02-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని గణేశ్‌పూర్ గ్రామ శివారులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే… గంగ్వార్ నుంచి బీదర్ వైపు వెళ్తున్న ప్యాసింజర్ ఆటోను, ఎదురుగా బీదర్ నుంచి జహీరాబాద్ దిశగా వస్తున్న హెచ్ఐఆర్ ట్రాలీ ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఆటో పూర్తిగా దెబ్బతిని, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదంతో కొంతసేపు ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు దెబ్బతిన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

రిపోర్టర్: సంగమేశ్వర్ రెడ్డి

నియోజకవర్గం: జహీరాబాద్

Sthanikam

న్యాల్కల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News