Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:26 AM

న్యాల్కల్ పశువుల జాతర: రూ.5.40 లక్షల వరకు ధరలు, రైతుల ఆనందం

02-02-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామ శివారులోని దర్గా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పశువుల జాతరకు వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాణ్యమైన పశువుల కొనుగోలు కోసం సంత ప్రాంగణం ఉదయం నుంచే సందడిగా మారింది.

పశువుల సంతలో దియోని, ఒంగోలు, కిల్లరి జాతులకు చెందిన ఎద్దులు, కోడెదూడలు, ఆవులు, పాడిగేదెలు అమ్మకానికి రాగా, ధరలు సుమారు రూ.50 వేల నుంచి రూ.5.40 లక్షల వరకు పలికాయి. ఈ జాతరలో రాయికోడ్ మండల్ జంగా (ఖుర్ద్) గ్రామానికి చెందిన సమీర్ రూ.2.40 లక్షలకు ఎద్దుల జతను కొనుగోలు చేశాడు. అనంతరం దర్గా దర్శనం చేసుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారుల పాల్గొనడంతో పశువుల ధరలు భారీగా పెరిగాయని రైతులు తెలిపారు. నాణ్యమైన జాతి పశువులకు మంచి డిమాండ్ ఉండటంతో ఈ జాతర రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా నిలిచింది.

ఉత్తమ పశుపోషకులైన రైతులకు స్థానిక గ్రామానికి చెందిన దివంగత అడివప్ప, గిరిజమ్మ జ్ఞాపకార్థం బహుమతులను జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, పట్టణ సీఐ శివలింగం, హద్నూర్ ఎస్‌ఐ దోమ సుజిత్ కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ రికార్డు సాధించిన ప్రముఖ శిల్పకారుడు డా. హోతి బస్వరాజ్, జాతర నిర్వాహకులు యూనుస్ ఖాన్, మక్సూద్, నర్సింహులు, వాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

న్యాల్కల్ పశువుల జాతర: రూ.5.40 లక్షల వరకు ధరలు, రైతుల ఆనందం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News