Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:30 PM

నాయకులుగా కాదుసేవకులుగా ఉంటాo బొబ్బలి సందీప రామ్ రెడ్డి

09-02-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 11వ వార్డు లో అధికార పార్టీ అభ్యర్థి మునగాల సందీప బొబ్బిలి రాంరెడ్డి గెలుపు దిశగా తన ప్రచార హోరును సాగిస్తున్నారు. ఆదివారం రోజున ఎన్నికల ప్రచారంలో భాగంగా 11వ వార్డులో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిరేకల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ వలన అభివృద్ధి సాధ్యమవుతుందని, , వీధి దీపాలు, డ్రైనేజీ, తదితర మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎప్పుడు ప్రజల ముందు ఉంటానని తెలియజేశారు. అంతేకాకుండా వార్డులో ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే సహకారంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. నాయకుడిలా కాకుండా ప్రజల మధ్య ఉండే సేవకుడిగా పనిచేస్తూ, ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం అందించేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఇతర పార్టీలకు తగిన గుణపాఠం చెప్పేందుకు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఏనుగు అంజిరెడ్డి నర్మద , మన్నెం సైదులు , ఇమ్మడి వెంకన్న, ముప్ప ముత్తిరెడ్డి, బొర్రా రెడ్డి చోల్లేటి శ్రీకాంత్, దామనూరి, సైదులు నర్సిరెడ్డి, మాద శ్రీను, ఆమనగంటి నరేష్ షేక్ అక్రమ్ గుంటోజు శ్రీను, గుంటోజు సంతోష్, మరియు యువజన విభాగం నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

నాయకులుగా కాదుసేవకులుగా ఉంటాo బొబ్బలి సందీప రామ్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News