Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:16 AM

నూజివీడు లో ఎక్సైజ్ అధికారుల ముమ్మర తనిఖీలు

నూజివీడు లో ఎక్సైజ్ అధికారుల ముమ్మర తనిఖీలు

నూజివీడు లో ఎక్సైజ్ అధికారుల ముమ్మర తనిఖీలు
January 06, 2026 10:10 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి నూజివీడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు విదేశాల నుంచి నూజివీడు స్టేషన్ పరిధిలోని నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు మరియు చాట్రాయి మండలాలకు పెద్ద ఎత్తున ప్రజల రాకపోకలు జరుగుతున్న నేపథ్యంలో, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలతో రహదారులపై వాహనాల తనిఖీలు చేపట్టినట్లు నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఏ. మస్తానయ్య తెలిపారు.ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లేదా విదేశాల నుంచి అక్కడి మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తీసుకురావడం, కలిగి ఉండటం లేదా రవాణా చేయడం ఎక్సైజ్ చట్టం ప్రకారం నేరమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అనుమతితో నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండగా, బయట రాష్ట్రాల మద్యం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు. బయట రాష్ట్రాల మద్యంతో ఎవరైనా పట్టుబడితే, సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసి కేసులు నమోదు చేయడమే కాకుండా, మద్యం రవాణాకు ఉపయోగించిన వాహనాలను కూడా స్వాధీనం చేసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో నూజివీడు స్టేషన్ పరిధిలోని నాలుగు మండలాల్లో ప్రత్యేక బృందాలతో రహదారులపై వాహనాల తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే ప్రైవేటు బస్సులు, టూరిస్ట్ బస్సులు, ప్రైవేట్ టాక్సీల యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రైవర్లు, ప్రయాణికులు లేదా వారి బంధువులు ఎవరైనా ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లేదా విదేశీ మద్యం రవాణా చేస్తూ పట్టుబడితే, సంబంధిత వాహనాలపై కూడా కేసులు నమోదు చేసి స్వాధీనం చేసుకుంటామని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News