Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

నూతన సంవత్సరం వేళ సూర్యాపేటలో పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు

30-12-2025 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పోలీస్ హై సెక్యూరిటీ.. డ్రగ్స్, గంజాయి రవాణాపై విస్తృత తనిఖీలు

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలి – జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట: డిసెంబర్ 31, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడంతో పాటు శాంతిభద్రతలు కాపాడే లక్ష్యంతో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కొత్త బస్టాండ్, హైటెక్ బస్టాండ్ ప్రాంగణాలు, రద్దీ ప్రాంతాలు, ఫ్లైఓవర్లు, ప్రధాన వాణిజ్య సముదాయాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

బస్సులు, బస్సు నిలుపుదల ప్రాంగణాలు, దుకాణాలు, ప్రయాణికుల లగేజీ, అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా పోలీస్ హై సెక్యూరిటీ విభాగం ఈ తనిఖీల్లో పాల్గొంది. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతున్న జాతీయ రహదారిపై ముఖ్య రవాణా కేంద్రంగా ఉన్న సూర్యాపేటలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం, గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం, కొత్త వ్యక్తుల కదలికలను గుర్తించడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

గుర్తింపు లేని వ్యక్తులకు లాడ్జీల్లో వసతి కల్పించవద్దని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. మాదకద్రవ్యాలు గుర్తించే డాగ్ స్క్వాడ్, పేలుడు పదార్థాలను గుర్తించే డాగ్స్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీల్లో పాల్గొని బస్సులు, అనుమానిత వస్తువులు, ప్రయాణికుల బ్యాగులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ అశోక, ఆర్ఎస్ఐ అన్వర్ రెహమాన్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

నూతన సంవత్సరం వేళ సూర్యాపేటలో పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News