Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు తప్పనిసరి: ఎస్పీ నరసింహ

29-12-2025 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నూతన సంవత్సరం వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలన్న ఎస్పీ నరసింహ

రోడ్లపై ర్యాలీలు, హంగామా, కేక్ కటింగ్‌కు అనుమతి లేదు

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనానికి నిషేధం

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ప్రజలకు సూచించారు. ప్రభుత్వం విధించిన నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో సాయంత్రం 6 గంటల నుంచే వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధమని స్పష్టం చేశారు. ఫామ్ హౌస్‌లు, క్లబ్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లో అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించరాదన్నారు. ప్రజలను భయాందోళనకు గురిచేసేలా క్రాకర్స్ పేల్చడం, అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే మైనర్‌తో పాటు వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని, త్రిబుల్ రైడింగ్‌, పెద్ద శబ్దాలు చేసే సైలెన్సర్లతో వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. గుంపులు గుంపులుగా రోడ్లపై హంగామా చేయడం, వాహన ర్యాలీలు, రోడ్లపై కేక్ కటింగ్‌కు అనుమతి లేదన్నారు. కుటుంబ సభ్యులతో ఇంట్లోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, పోలీస్ శాఖకు సహకరించాలని ప్రజలను కోరారు.

Sthanikam

నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు తప్పనిసరి: ఎస్పీ నరసింహ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News