Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:59 AM

నషాముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న:పీసీసీ సభ్యులు,ఖేఢ్ ఎస్సై

నషాముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న:పీసీసీ సభ్యులు,ఖేఢ్ ఎస్సై

నషాముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న:పీసీసీ సభ్యులు,ఖేఢ్ ఎస్సై
March 31, 2026 02:14 PM 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలో బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం (మౌంట్ ఆఫ్) వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నషాముక్తి భారత్ అభియాన్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. సమాజంలో మత్తు పదార్థాల వినియోగాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో అవగాహన ర్యాలీలు, సమావేశాల రూపంలో నిర్వహించబడుతుంది. ప్రజల్లో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.ఈ అవగాహన రథం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని సూచించారు. అలాగే స్థానిక ఎస్సై శ్రీశైలం, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సాయి సంగమేశ్వర్, లింగాయత్ సమాజ పెద్దలు శంకర్ పాటిల్, జంగమ సమాజ ప్రముఖులు శివకుమార్ స్వామి, ఆనంద స్వామి తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బ్రహ్మకుమారి ఇన్‌చార్జ్ లక్ష్మీ బెంజి మాట్లాడుతూ, నషాముక్తి భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో యువతలో చైతన్యం తీసుకురావడం, మత్తు పదార్థాల వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News