Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రచారం

07-02-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని మొత్తం 15 మున్సిపాలిటీ వార్డులలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఒకటో వార్డు నుంచి పదిహేనో వార్డు వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా వార్డుల వారీగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ ఎన్నికల ప్రచారంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ చైర్మన్ కాబోతున్న మాజీ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులు నగేష్ షెట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాసులు, జిల్లా నాయకులు చంద్రశేఖర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రతి వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను నేరుగా కలిసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా నాయకులు ప్రజలకు వివరించారు.జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నగేష్ షెట్కార్, చంద్రశేఖర్ రెడ్డి తదితర నాయకులు అందరూ కలిసి సమన్వయంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు.కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతుందని, మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు మరింత వేగంగా చేపడతామని హామీ ఇచ్చారు.ఏ పరిస్థితుల్లోనైనా నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని నాయకులు పూర్తి ధీమాతో ప్రకటించారు. నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని అన్ని వార్డుల ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపిస్తారని కాబోయే చైర్మన్ నగేష్ షెట్కార్ ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రచారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News