Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

నారాయణఖేడ్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర

Updated : 23 Jan 2026 16:59 IST
As Preferred Source 1 min read
నారాయణఖేడ్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నారాయణఖేడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విజ్ఞాన విహారయాత్ర నిర్వహించబడింది. ప్రధానమంత్రి శ్రీ పథకం లో భాగంగా, జడ్పీహెచ్ఎస్ నారాయణఖేడ్ పాఠశాలలో చదువుతున్న ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ తరగతుల విద్యార్థులను ఈరోజు కంది లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థకు తీసుకెళ్లడం జరిగింది.ఈ విజ్ఞాన విహారయాత్ర ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యా సంస్థలను ప్రత్యక్షంగా సందర్శించి, అక్కడి విద్యా విధానాలు, పరిశోధనల గురించి అవగాహన పెంపొందించుకున్నారు. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, నూతన ఆలోచనలకు ప్రోత్సాహం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన్మధ కిషోర్ తెలిపారు.మరో విడతలో మరికొంతమంది విద్యార్థులను కూడా ఇలాంటి విజ్ఞాన విహారయాత్రలకు తీసుకెళ్లే ప్రణాళిక ఉందని ఆయన తెలిపారు. విజ్ఞాన విహారయాత్రలతో పాటు రాబోయే రోజుల్లో క్షేత్ర సందర్శనలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే వారి భవిష్యత్ లక్ష్యాలకు ఇది ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.ప్రస్తుత కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక విజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుని పోటీ ప్రపంచంలో ముందంజలో నిలవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు యాదగిరి, అశోక్ గౌడ్, రాజశేఖర్, చంద్రశేఖర్ ఆచార్య, గురునాథ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణఖేడ్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news