Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

నారాయణఖేడ్ 8వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

06-02-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీ 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగేష్ శెట్కార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల గురించి వివరించారు.నగర అభివృద్ధి, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని, ప్రజలతో కలిసి ముందుకు సాగడమే తమ లక్ష్యమని చెప్పారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుపై ఓటు వేసి తనను భారీ ఆధిక్యంతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణఖేడ్ 8వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News