Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:30 AM

నారాయణ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి కలెక్టర్‌కు డీఎస్‌ఎఫ్ వినతి.

01-06-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు దినాల్లో ఉపాధ్యాయులతో పని చేయించడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆదోని నారాయణ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డీఎస్‌ఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కర్నూలు జిల్లా కలెక్టర్ సిరికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ.. ఆదోని పట్టణంలోని నారాయణ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెలవు దినాల్లో కూడా అడ్మిషన్ల పేరుతో ఉపాధ్యాయులతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సరైన ధ్రువపత్రాలు లేకుండానే ఆధార్ కార్డుల ఆధారంగా అడ్మిషన్లు చేపడుతున్నారని పేర్కొన్నారు.

పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, బూట్లు, టెక్నో కోర్సులు, ఒలింపియాడ్ పరీక్షల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సాధించిన ర్యాంకులను తమ పాఠశాల ర్యాంకులుగా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజుల పట్టికను ప్రదర్శించకుండా ర్యాంకుల పేరుతో ప్రచారం నిర్వహించడం ద్వారా విద్యను వ్యాపార వస్తువుగా మార్చారని అన్నారు. విద్యా హక్కు చట్టం ఉద్దేశాలను దెబ్బతీస్తున్న ఇటువంటి చర్యలపై ఉన్నత విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

లేని పక్షంలో నారాయణ పాఠశాల ఎదుట, విద్యాశాఖ కార్యాలయాల ముందు దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

నారాయణ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి కలెక్టర్‌కు డీఎస్‌ఎఫ్ వినతి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News