Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

నార్కట్ పల్లి లిఫ్ట్ ముసుగులో దోపిడి ఇద్దరి అరెస్ట్

06-02-2026 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్‌పల్లి పరిధిలో లిఫ్ట్ ఇస్తామని మోసం చేసి లారీ డ్రైవర్‌ను బెదిరించి ఫోన్ దోచుకున్న ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.ఈ నెల 3న ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ సునీల్ తివారి ఏపీ లింగోటం వద్ద కిరాణా షాపుకు వెళ్తున్న సమయంలో స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామని మాటిచ్చారు. వారి మాటలు నమ్మిన డ్రైవర్ స్కూటీపై ఎక్కగానే, శ్రీనివాస టౌన్‌షిప్ సమీపానికి చేరుకున్న వెంటనే ఇనుప రాడ్డుతో బెదిరించారు. అనంతరం అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నార్కట్‌పల్లి ఎస్సై విష్ణుమూర్తి ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా నిందితులు లింగస్వామి, ఎస్‌కే ఉమర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు.

ప్రజలు అపరిచితుల లిఫ్ట్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రాంతంలో శాంతిభద్రతలు కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.

Sthanikam

నార్కట్ పల్లి లిఫ్ట్ ముసుగులో దోపిడి ఇద్దరి అరెస్ట్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News