Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వర్షాభావ పరిస్థితుల్లో పత్తి పంటను కాపాడుకోండి: వ్యవసాయ అధికారి సంతోష్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:21 PM

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పబ్‌లను తనిఖీ చేసిన కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి

29-12-2025 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మల్కాజిగిరి స్థానికం రిపోర్టర్

నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, చట్టబద్ధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి శుక్రవారం నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు పబ్‌ లను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా నేరేడ్మెట్ పరిధిలో ఉన్న బ్యారాక్స్ అండ్ యాంటీ రూమ్, హౌస్ పార్టీ, 10D పబ్‌లను ఆయన పరిశీలించారు. పబ్ మేనేజ్‌మెంట్‌లతో మాట్లాడిన ఏసీపీ వెంకట్ రెడ్డి, నూతన సంవత్సర వేడుకలు డ్రగ్స్ ఫ్రీ ఈవెంట్‌గా నిర్వహించాలని స్పష్టంగా సూచించారు.

అలాగే పబ్‌లకు వచ్చే వాహనాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ మైనర్‌లకు మద్యం విక్రయించకూడదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పబ్ యాజమాన్యాలకు ఆయన స్పష్టం చేశారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్‌తో పాటు ఎస్ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని నేరేడ్మెట్ పోలీసులు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

Sthanikam

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పబ్‌లను తనిఖీ చేసిన కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి

Article Image
మల్కాజిగిరి స్థానికం రిపోర్టర్

నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, చట్టబద్ధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి శుక్రవారం నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు పబ్‌ లను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా నేరేడ్మెట్ పరిధిలో ఉన్న బ్యారాక్స్ అండ్ యాంటీ రూమ్, హౌస్ పార్టీ, 10D పబ్‌లను ఆయన పరిశీలించారు. పబ్ మేనేజ్‌మెంట్‌లతో మాట్లాడిన ఏసీపీ వెంకట్ రెడ్డి, నూతన సంవత్సర వేడుకలు డ్రగ్స్ ఫ్రీ ఈవెంట్‌గా నిర్వహించాలని స్పష్టంగా సూచించారు.

అలాగే పబ్‌లకు వచ్చే వాహనాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ మైనర్‌లకు మద్యం విక్రయించకూడదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పబ్ యాజమాన్యాలకు ఆయన స్పష్టం చేశారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్‌తో పాటు ఎస్ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని నేరేడ్మెట్ పోలీసులు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News