Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:12 PM

నాలుగు సీట్లు గెలవరు.. చైర్మన్ ఎలా అవుతారు

నాలుగు సీట్లు గెలవరు.. చైర్మన్ ఎలా అవుతారు

నాలుగు సీట్లు గెలవరు.. చైర్మన్ ఎలా అవుతారు
February 10, 2026 08:30 AM 165 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నాలుగు సీట్లు కూడా గెలవదు.. చైర్మన్ ఎలా అవుతారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం చిన్న కొండూరు రోడ్డులో సోమవారం కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ 2018లో కెసిఆర్ గాలిలో సైతం మునుగోడు ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించాలని, మునుగోడు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. మునుగోడు ప్రాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేశానని గుర్తుచేశారు. రాజీనామా ఫలితంగానే 100పడకల ఆస్పత్రి, సిసి రోడ్లు, డ్రైనేజీలతో అభివృద్ధి జరిగిందన్నారు.చౌటుప్పల్ ప్రాంతంలో 40వేల జనాభా ఉందని, పరిశ్రమల వల్ల లక్ష జనాభా జీవిస్తున్నారన్నారు. రాబోయే దశాబ్ద కాలంలో 5లక్షల జనాభా వరకు పెరగవచ్చన్నారు. అందుకు అనుగుణంగా 1 స్మార్ట్ సిటీ చేసే విధంగా మాస్టర్ ప్లాన్ రుపొందిస్తున్నానన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 100సార్లు పోటీ చేసిన నాపై గెలవడని, కూసుకుంట్లనా.. ఊసుకండ్లనా అని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా తనను గుర్తిస్తారని, నియోజకవర్గం దాటితే కూసుకుంట్లను గుర్తించే వారే లేరన్నారు.తెలంగాణ రాష్ట్రం కోసం సోనియా గాంధీతో కొట్లాడానని గుర్తుచేశారు. కూసుకుంట్ల కేసీఆర్ ముందు కూర్చోవడానికి కూడా భయపడతాడని ఆరోపించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎలా బ్రతికాడో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా అలాగే బ్రతుకుతారన్నారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి శిష్యులం మాట ఇస్తే మడమ తిప్పమన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకొని చౌటుప్పల్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందు నడపాలన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్ యువజన విభాగం మున్సిపల్ అధ్యక్షుడు తొర్పునూరి నరసింహ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు కొసనం రాకేష్ రెడ్డి, సుర్వి మంజుల నరసింహ గౌడ్, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, ఇప్ప వెంకటేష్, కొండూరు ధర్మేందర్ గౌడ్, రావుల వసంత స్వామి, కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, బద్రి గాలయ్య, మొగుదాల పావని రమేష్ గౌడ్, దేప రమ్య రాజు ముదిరాజ్, గోశిక వినయ్, పాక చిరంజీవి, బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్, ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్, అంతటి విజయలక్ష్మి బాలరాజు గౌడ్, వెన్ రెడ్డి సంధ్య రాజు, గుగులోతు అరుణ, పిల్లలమర్రి మధుసూదన్, ఎండి హన్ను బాయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News