Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:10 PM

నలంద డిగ్రీ కళాశాలలో సిగ్నేచర్ డే వేడుకలు

01-04-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జ్ఞాపకాల సంతకంతో భావోద్వేగ వీడ్కోలు – ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని ఉపాధ్యాయుల పిలుపు

నలంద డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు జ్ఞాపకాల సంతకం పేరుతో సిగ్నేచర్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మూడు సంవత్సరాల విద్యార్థి జీవితంలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విద్యార్థులు భావోద్వేగ క్షణాలను అనుభవించారు.ఈ సందర్భంగా కళాశాల మేనేజ్మెంట్, అధ్యాపకులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో విజయవంతమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని నలంద డిగ్రీ కళాశాల ఎల్లప్పుడూ అందిస్తుందని తెలిపారు.విద్యార్థి జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ ప్రారంభమవుతుందని, కళాశాలను వదిలి వెళ్లడం బాధాకరమైనదైనా, దాన్ని జీవితంలో ఎదుగుదలకు మొదటి మెట్టుగా భావించాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని సరైన దిశలో ముందుకు సాగాలని ఉపాధ్యాయులు హితవు పలికారు. విద్యార్థులు ఒకరి నుంచి మరొకరు సంతకాలు సేకరించుకుని, కన్నీటి పర్యంతంగా వీడ్కోలు చెప్పుకున్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బత్తుల శంకర్, కరస్పాండెంట్ వల్లమల రాజశేఖర్, ప్రిన్సిపాల్ పోలు విష్ణుకుమార్, డైరెక్టర్లు వాలుగొండ శ్రీనివాస్, చిలువేరు దుర్గయ్య, కట్టెల లింగస్వామి, అధ్యాపకులు కడగంచి రాములు, లింగయ్య, నాగలక్ష్మి, శివప్రసాద్, సువర్ణ, మహేష్, బాలరాజు, శ్రీవాణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నలంద డిగ్రీ కళాశాలలో సిగ్నేచర్ డే వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News