“నల్లగొండ క్లాక్ టవర్ దగ్గర నిరుపేద పండ్ల, పూల వ్యాపారుల కోసం వక్ఫ్ భూమి కేటాయింపు డిమాండ్ – మంత్రి గారికి ప్రజా విన్నపం!”
“నల్లగొండ క్లాక్ టవర్ దగ్గర నిరుపేద పండ్ల, పూల వ్యాపారుల కోసం వక్ఫ్ భూమి కేటాయింపు డిమాండ్ – మంత్రి గారికి ప్రజా విన్నపం!”
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ వక్ఫ్ బోర్డు దర్గా స్థలాన్ని నిరుపేద పండ్ల, పూల వ్యాపారులకు కేటాయించాలని ముస్లిం ప్రజాప్రతినిధులు, మేధావులు మరియు ప్రజలు గౌరవ మంత్రి గారిని వేడుకున్నారు. నిరుపేదл కోసం ప్రజలు చేస్తున్న ఈ వినూత్న ప్రతిపాదన పట్టణ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి పెద్ద పరిణామంగా నిలవడానికి సిద్ధంగా ఉంది. NDMS రైతు సొసైటీ, ప్రభుత్వ దర్గా వక్ఫ్ భూమిలోని 18 ఫీట్ల రోడ్డు మరియు దర్గా కమాన్ రోడ్ మధ్య ఉన్న ఖాళీగా ఉన్న స్థలంలో నిరుపేద పండ్ల, పూల దుకాణాలను ఏర్పాటు చేయాలని ప్రజలు సూచిస్తున్నారు. ఈ స్థలం నడిబొడ్డున ఉండడంతో, పండ్ల, పూల వ్యాపారాలకు అత్యంత అనుకూలమైనది. ఓల్డ్ సిటీ, న్యూ సిటీకి మధ్యలో ఉన్న ఈ ఝోన్‌లో పట్టణ అభివృద్ధి త్వరలోనే మెరుగుపడుతుంది.
రౌడీయిజం, వక్ఫ్ భూమి రక్షణ: విలువైన వక్ఫ్ భూములను అక్రమంగా కబ్జా చేసే డూప్లికేట్ ముఠాలు, రౌడీ ముఠాలు నేరస్థులు చేస్తున్న దోపిడీ నుంచి ఈ స్థలాన్ని రక్షించి, నిరుపేద పండ్ల, పూల వ్యాపారులకు అప్పగించాలని ప్రజలు కోరుతున్నారు. ఖాళీ స్థలంలో డబ్బాలు వేసి లక్షల రూపాయలు వసూలు చేసే నేరస్థుల నుండి ఈ భూమిని కాపాడాలని వారు అభిప్రాయపడుతున్నారు. కొత్త, పాత వక్ఫ్ చట్టాలు కూడా ఈ స్థలాన్ని సంక్షేమానికి ఉపయోగించాలని స్పష్టం చేస్తున్నాయి. మన పూర్వీకులు వక్ఫ్ చేసింది కూడా ఈ సంక్షేమం కోసమే కదా?
ఆందోళన, పరిష్కారం: ప్రజలు తెలిపిన ప్రకారం, షాదీ ఖానా (ఉర్దూగర్) వెనక లతీఫ్ సాహెబ్ కొండను అక్రమంగా డూప్లికేట్ గ్యాంగులు టవ్వర్లు చేయటానికి తవ్వి పెట్టారు. వెనుక ఉన్న సుమారు రెండు ఎకరాల స్థలాన్ని అక్రమంగా అమ్మటానికి దొరికి పెట్టారు. ఈ స్థలాన్ని మార్కెట్గా ఉపయోగించవచ్చని తెలుస్తోంది. లేకపోతే త్వరలోనే డూప్లికేట్ గ్యాంగులు తమ సొంత స్థలమని చెప్పి అమ్మేస్తారు. ఈ విలువైన స్థలాన్ని నిరుపేదల అవసరాల కోసం ఉపయోగించాలని ముస్లిం మేధావులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
మంత్రి గారికి విన్నపం: మైనార్టీల పక్షపాతిగా పేరున్న గౌరవ మంత్రి గారు వక్ఫ్ అధికారులతో మాట్లాడి, నామమాత్రపు అద్దెతో పేదలకు శాశ్వత దుకాణాల స్థలాలు ఇప్పించాలని వ్యాపారులు వేడుకున్నారు. రౌడీయిజం, అక్రమ వసూళ్లకు చెక్ పెట్టడానికి ఖాళీగా ఉన్న వక్ఫ్ స్థలంలో నిరుపేదలకు దుకాణాలు కేటాయించడమే సరైన పరిష్కారం. ఇది ప్రభుత్వ వక్ఫ్ భూమిని రక్షిస్తుంది, వందలాది పేద కుటుంబాలకు ఉపాధినిస్తుంది.
పట్టణ అభివృద్ధి, పేదల సంక్షేమం: పట్టణ అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం మంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవాలని ముస్లిం మేధావులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు. లతీఫ్ సాహెబ్ దర్గా అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఘాట్ రోడ్డు పూర్తయితే దర్గా ప్రాంతం రాష్ట్ర స్థాయిలోనే. . .

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి