Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీఎంజేఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలకు కరపత్రికల ఆవిష్కరణ. ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 03:10 AM

నల్లగొండను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

26-03-2026 197 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

చదువులతోనే కుటుంబాల్లో వెలుగులు..

కనగల్‌లో రూ. 6 కోట్లతో జూనియర్ కళాశాల భవనానికి భూమిపూజ..

నల్గొండ : నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. గురువారం జిల్లాలోని కనగల్‌ మండల కేంద్రంలో రూ. 6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. విద్య ద్వారానే సామాజిక అభివృద్ధి కుటుంబాల ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను తప్పనిసరిగా చదివించాలని కోరారు. ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఆధునిక వసతులతో కూడిన 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్' పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్ విద్యార్థులకు కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు

వెల్లడించారు.

నిరుద్యోగులకు ఉపాధి మహిళలకు భరోసా..

​జిల్లా కేంద్రంలో రూ. 150 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మించామని, నర్సింగ్ కళాశాల పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు రూ. 20 కోట్లతో 'న్యాక్' భవనం, రూ. 80 కోట్లతో ఏటీసీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళా సంఘాల బలోపేతానికి ఎస్ఎల్బీసీ వద్ద రూ. 5 కోట్లతో పెట్రోల్ పంప్, సూపర్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని, సోలార్ ప్యానెల్స్ ద్వారా మహిళలు అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు.

రూ. 400 కోట్లకు పైగా నిధులతో రహదారుల నిర్మాణం..

​నియోజకవర్గంలో రహదారుల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్లు మంత్రి వివరించారు.​ నల్గొండ - దర్వేశిపురం డబుల్ రోడ్డుకు రూ. 50 కోట్లు, ధర్వేశిపురం - గుర్రంపోడు రోడ్డుకు రూ. 180 కోట్లు (వారం రోజుల్లో పనులు ప్రారంభం), రేగట్ట వరకు డబుల్ రోడ్డుకు రూ. 60 కోట్లు. ముషంపల్లి రోడ్డుకు రూ. 100 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.​.కనగల్ చవురస్తా వద్ద అసంపూర్తి పనులకు రూ. 8 కోట్లు కేటాయించామన్నారు.కనగల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ, రూ. 50 కోట్లతో మునుగోడు, కాంచనపల్లి, రేగట్ట లిఫ్ట్ ఇరిగేషన్లు చేపడుతున్నామని, మండల కేంద్రంలో గోడౌన్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అంతకుముందు మంత్రి ధర్వేశిపురంలోని రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.. కలెక్టర్

​జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కనగల్ జూనియర్ కళాశాల భవనం అందుబాటులోకి వస్తే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. జిల్లాలో 'అమ్మ ఆదర్శ పాఠశాల' కమిటీల ద్వారా రూ. 2.91 కోట్లతో పాఠశాలల్లో మరమ్మతులు చేపడుతున్నామని కనగల్‌లో పైలట్ ప్రాజెక్టుగా 260 ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ పేదల పక్షాన నిలుస్తోందన్నారు.​ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, డీఐఈఓ దశ్రు నాయక్, ప్రిన్సిపాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

నల్లగొండను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News