Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:32 AM

నల్గొండలో విజ్ఞాన్‌ స్పాట్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌.విద్యార్థులకు ఇంజినీరింగ్‌ కోర్సులపై అవగాహన

18-05-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ టౌన్‌, ఇంటర్‌ పూర్తిచేసుకున్న విద్యార్థుల కోసం విజ్ఞాన్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ ఆధ్వర్యంలో 2026 స్పాట్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ కార్యక్రమాన్ని నల్గొండలో నిర్వహించారు. హైదరాబాద్‌ రోడ్డులోని హోటల్‌ మనోరమ బ్యాంకెట్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన, ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్య, కాలేజీ ఎంపిక, బ్రాంచ్‌ల ఎంపికపై నిపుణులు అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు అక్కడికక్కడే అడ్మిషన్లు కూడా తీసుకున్నారు.

విజ్ఞాన్‌ గ్రూప్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య సూచనలతో, వీఎఫ్‌ఎస్‌టీఆర్‌ హైదరాబాద్‌ ఆఫ్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వైవీ దాసేశ్వరరావు సలహాలతో కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అడ్మిషన్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సునీల్‌కుమార్‌ సమన్వయంతో కౌన్సెలింగ్‌ విజయవంతమైంది.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌, ఫార్మసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ నరేష్‌ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. స్థానిక సిబ్బంది ఉబ్బని శ్రీకాంత్‌, జిల్లా అడ్మిషన్‌ మేనేజర్‌ సైదులు, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నల్గొండలో విజ్ఞాన్‌ స్పాట్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌.విద్యార్థులకు ఇంజినీరింగ్‌ కోర్సులపై అవగాహన

Article Image

నల్గొండ టౌన్‌, ఇంటర్‌ పూర్తిచేసుకున్న విద్యార్థుల కోసం విజ్ఞాన్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ ఆధ్వర్యంలో 2026 స్పాట్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ కార్యక్రమాన్ని నల్గొండలో నిర్వహించారు. హైదరాబాద్‌ రోడ్డులోని హోటల్‌ మనోరమ బ్యాంకెట్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన, ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్య, కాలేజీ ఎంపిక, బ్రాంచ్‌ల ఎంపికపై నిపుణులు అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు అక్కడికక్కడే అడ్మిషన్లు కూడా తీసుకున్నారు.

విజ్ఞాన్‌ గ్రూప్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య సూచనలతో, వీఎఫ్‌ఎస్‌టీఆర్‌ హైదరాబాద్‌ ఆఫ్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వైవీ దాసేశ్వరరావు సలహాలతో కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అడ్మిషన్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సునీల్‌కుమార్‌ సమన్వయంతో కౌన్సెలింగ్‌ విజయవంతమైంది.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌, ఫార్మసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ నరేష్‌ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. స్థానిక సిబ్బంది ఉబ్బని శ్రీకాంత్‌, జిల్లా అడ్మిషన్‌ మేనేజర్‌ సైదులు, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News