Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:25 PM

నల్గొండలో ఉద్యోగాల పేరిట మోసం: నిరుద్యోగులకు భారీ దగా

02-05-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లాలో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. దేవాదాయ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఓ ముఠా వందలాది మందిని మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆలయాల్లో హుండీ లెక్కింపు, ఇతర చిన్నపాటి ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. దాదాపు 1500 మంది బాధితుల నుంచి కోట్ల రూపాయలు ఈ గ్యాంగ్ దోచుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

డబ్బులు చెల్లించినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడం, ముఠా సభ్యులు ఫోన్లకు స్పందించకపోవడంతో బాధితులు మోసపోయినట్లు గ్రహించారు. ఈ మోసానికి ప్రధాన సూత్రధారి పులి రవి అని తెలుస్తోంది. అతనికి ఏజెంట్‌గా పనిచేసిన జనార్ధన్ కట్టంగూరు మండలం అన్నారం గ్రామానికి చెందినవాడిగా, ప్రస్తుతం నల్గొండలో నివసిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఈ వ్యవహారం పెద్దగా బయటకు రాలేదు. అయితే ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపితే ఈ కుంభకోణం పూర్తిగా బయటపడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Sthanikam

నల్గొండలో ఉద్యోగాల పేరిట మోసం: నిరుద్యోగులకు భారీ దగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News