Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:45 AM

నల్గొండలో గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై దాడులు – 68 సిలిండర్లు సీజ్, 6A కేసులు నమోదు

12-03-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ గృహ వినియోగానికి ఉద్దేశించిన ఎల్‌పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్న హోటళ్లపై అధికారుల బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. నల్గొండ పట్టణంతో పాటు మల్లేపల్లి టౌన్‌లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 68 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.నల్గొండ టౌన్‌లోని ప్రసాద్ ఉడిపి హోటల్, నందిని హోటల్, కృతుంగ హోటళ్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఇదే తరహాలో మల్లేపల్లి టౌన్‌లోని నేహా హోటల్, సాయినందిని హోటల్, తేజస్విన్ వాటర్ ప్లాంట్స్ తదితర ప్రదేశాల్లో కూడా దాడులు నిర్వహించారు.ఈ తనిఖీల్లో గృహ వినియోగానికి కేటాయించిన సిలిండర్లు పెద్ద ఎత్తున అక్రమంగా ఉపయోగిస్తున్నట్టు తేలడంతో మొత్తం 68 సిలిండర్లను సీజ్ చేశారు. సంబంధిత హోటల్ యాజమాన్యాలపై ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం కింద 6A కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.అనుమతి లేకుండా గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలపై భవిష్యత్తులో కూడా నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు.

Sthanikam

నల్గొండలో గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై దాడులు – 68 సిలిండర్లు సీజ్, 6A కేసులు నమోదు

Article Image

నల్గొండ గృహ వినియోగానికి ఉద్దేశించిన ఎల్‌పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్న హోటళ్లపై అధికారుల బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. నల్గొండ పట్టణంతో పాటు మల్లేపల్లి టౌన్‌లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 68 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.నల్గొండ టౌన్‌లోని ప్రసాద్ ఉడిపి హోటల్, నందిని హోటల్, కృతుంగ హోటళ్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఇదే తరహాలో మల్లేపల్లి టౌన్‌లోని నేహా హోటల్, సాయినందిని హోటల్, తేజస్విన్ వాటర్ ప్లాంట్స్ తదితర ప్రదేశాల్లో కూడా దాడులు నిర్వహించారు.ఈ తనిఖీల్లో గృహ వినియోగానికి కేటాయించిన సిలిండర్లు పెద్ద ఎత్తున అక్రమంగా ఉపయోగిస్తున్నట్టు తేలడంతో మొత్తం 68 సిలిండర్లను సీజ్ చేశారు. సంబంధిత హోటల్ యాజమాన్యాలపై ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం కింద 6A కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.అనుమతి లేకుండా గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలపై భవిష్యత్తులో కూడా నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News