Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:24 PM

నల్గొండలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం

నల్గొండలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం

నల్గొండలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
15-05-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ మండల కేంద్రంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదై ఏడు రోజులు గడిచినా అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గమని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి బీ-టీమ్‌లా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండదండలతో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.

బాధిత బాలిక కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించి న్యాయం చేయాలని, కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించాలని, రాష్ట్ర ప్రభుత్వం బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో మహిళల భద్రత పూర్తిగా దెబ్బతిందని, మహిళల రక్షణ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. అలాగే ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.

Sthanikam

నల్గొండలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News