Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చి.. కుమారుడిని కోల్పోయిన తల్లి! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 05:11 PM

నల్గొండ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ రేసు హీటప్! ఇబ్రహీం అవకాశాలు బలంగా!!!

15-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మైనార్టీల కలలు నెరవేర్చనున్నారా?

ఎన్నికల ఫలితాలు: నల్గొండమున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ 27 స్థానాలతో మేజిక్ ఫిగర్‌కు చేరుకుంది. బీఆర్ఎస్ 9, బీజేపీ 4, స్వతంత్రులు 8 స్థానాలు సాధించారు. మొత్తం 48 వార్డుల్లో కాంగ్రెస్ ఏకపక్ష పటాక ఎగురవేసింది. మేయర్ పదవి బుర్రి చైతన్య-శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఖతమైనా, డిప్యూటీ మేయర్ ఎంపికపై రాజకీయ ఉత్కంఠ మొదలైంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇబ్రహీం పేరు ముందంజలో: 21వ వార్డు నుంచి ఇబ్రహీం భారీ మెజారిటీ (1300+ ఓట్ల తేడాతో) గెలిచారు. జిల్లాలోనే అత్యధిక మెజారిటీ సాధించిన కార్పొరేటర్‌గా ఆయన పేరు చర్చల్లో ఉంది. మైనార్టీలలో ప్రభావవంతమైన నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు. జమీయత్ ఉలేమా ఏ హింద్ తెలంగాణ అధ్యక్షులు ఆయన పేరు సిఫారసు చేశారని ప్రచారం. మైనార్టీల మద్దతు, సామాజిక సమన్వయ సామర్థ్యం ఆయన అవకాశాలను బలపరుస్తున్నాయి.

మంత్రి వెంకటరెడ్డి వ్యూహం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఆలోచిస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ మైనార్టీల మద్దతుతోనే గెలిచింది. డిప్యూటీ మేయర్ పదవి ముస్లిం సామాజిక వర్గానికి కేటాయిస్తే పార్టీ బలం మరింత పెరుగుతుందని అభిప్రాయం. మంత్రి నిర్ణయం మైనార్టీలలో మంచి సందేశం పంపుతుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.

అంతర్గత రాజకీయాలు: బీసీ సామాజిక వర్గం మాజీ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ పేర్లు ప్రస్తావనలో ఉన్నాయి. ఇబ్రహీంకు అడ్డుకట్టేందుకు అంతర్గత లాబీయింగ్ జరుగుతోందని చర్చ. వర్గీయ సమతుల్యత, పార్టీ అంతర్గత పోటీలు ఎంపికను సంక్లిష్టం చేస్తున్నాయి. అయితే ఇబ్రహీం మెజారిటీ, మైనార్టీ మద్దతు, బుర్రి అనుచరుడి గుర్తింపు బలాలు.

రాజకీయ నేపథ్యం: నల్గొండకార్పొరేషన్ మొదటిసారి ఏర్పడిన నేపథ్యంలో ఈ ఎంపికలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. కాంగ్రెస్ మేయర్, డిప్యూటీల మధ్య సమతుల్యత కార్పొరేషన్ పాలనకు ఆకృతి ఇస్తుంది. మంత్రి నిర్ణయం పార్టీ ఐక్యతకు, మైనార్టీల విశ్వాసానికి కీలకం. అధికారిక ప్రకటన వరకు రాజకీయ చర్చలు కొనసాగుతాయి.

Sthanikam

నల్గొండ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ రేసు హీటప్! ఇబ్రహీం అవకాశాలు బలంగా!!!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News