Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:52 PM

నల్గొండ బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల

28-01-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నల్లగొండ: రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ మున్సిపాలిటీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. వివిధ డివిజన్లలో సామాజిక సమీకరణలు, మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తూ పార్టీ నాయకత్వం అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం.

మూడో డివిజన్‌లో ఎస్సీ మహిళా కోటాలో మల్లేశ్వరి అశోక్‌కు టికెట్ కేటాయించారు. ఏడో డివిజన్‌లో జనరల్ మహిళగా మారగోని భవాని గణేష్‌ను బరిలో నిలిపారు. తొమ్మిదో డివిజన్‌లో ఎస్టీ జనరల్ విభాగంలో బాణావతి దీప్లా నాయక్‌కు అవకాశం దక్కింది.

పదకొండో డివిజన్‌లో దండంపల్లి సుజాత సత్తయ్య (జనరల్ మహిళ), పదమూడో డివిజన్‌లో గుండ్రెడ్డి రాధిక యుగంధర్ రెడ్డి (జనరల్), పదిహేనో డివిజన్‌లో దొడ్డి రమేష్ (ఎస్సీ జనరల్) అభ్యర్థులుగా ప్రకటించారు.

పదహారో డివిజన్‌లో ఎస్సీ మహిళగా ఏర్పుల తర్షణ రవిని ఎంపిక చేయగా, పదిహేడో డివిజన్‌లో మందడి లిఖిత సైదిరెడ్డి (జనరల్ మహిళ)కు టికెట్ ఇచ్చారు. ఇరవయ్యో డివిజన్‌ను సీపీఎంకు కేటాయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇరవై ఒకటో డివిజన్‌లో అఫ్జల్ ఖాన్ (జనరల్), ఇరవై ఐదో డివిజన్‌లో మాతంగి ఉమాదేవి (జనరల్ మహిళ), ఇరవై ఆరవ డివిజన్‌లో నాజ్మీన్ (బీసీ మహిళ) అభ్యర్థులుగా ఖరారయ్యారు.

ఇరవై ఏడో డివిజన్‌లో బీసీ మహిళా కోటాలో షమీనా సుల్తానా, జమాల్ ఖాద్రి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముప్పై ఒకటో డివిజన్‌లో మిరియాల జ్యోతి స్వామి (జనరల్ మహిళ), ముప్పై ఎనిమిదో డివిజన్‌లో అల్లి గౌతమి శివశంకర్ (బీసీ మహిళ), ముప్పై తొమ్మిదో డివిజన్‌లో అల్లి వేణు యాదవ్ (బీసీ జనరల్)కు టికెట్లు ఖరారయ్యాయి.

నలభై రెండో డివిజన్‌లో ఎం. అనురాధ నాగరాజు (జనరల్ మహిళ), నలభై ఏడో డివిజన్‌లో సింగం లక్ష్మీ రామ్మోహన్ (జనరల్ మహిళ)కు అవకాశం కల్పించారు.

మొత్తంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థుల జాబితా విడుదలతో నల్లగొండ మున్సిపాలిటీలో ఎన్నికల వేడి మరింత పెరిగింది.

Sthanikam

నల్గొండ బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News