Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 08:47 AM

నలభై ఎనిమిది వార్డుల పౌరులకు అందుబాటులో ఉంటా – నివేదిత లక్షాది

22-02-2026 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సాయి కల్యాణ్ అపార్ట్మెంట్‌లో ఆత్మీయ సన్మానం

సూర్యాపేట పట్టణంలోని సాయి కల్యాణ్ అపార్ట్మెంట్‌లో నిర్వహించిన స్నేహ సమావేశ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా ముప్పై మూడు వ వార్డు కౌన్సిలర్ నాగుల శ్రీనివాసు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముప్పై మూడు వ వార్డు పౌరులు వారికి ఘనంగా ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా నివేదిత లక్షాది మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని నలభై ఎనిమిది వార్డుల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరిస్తామని చెప్పారు. సూర్యాపేటను ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు మేధావుల సలహాలు, ప్రజల సూచనలు తీసుకుంటూ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతామని వెల్లడించారు.

వార్డు అభివృద్ధికి ప్రజల సహకారం అత్యంత ముఖ్యమని, శుభ్రత, మౌలిక వసతులు, వీధి దీపాలు, తాగునీరు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ముప్పై మూడు వ వార్డు కౌన్సిలర్ నాగుల శ్రీనివాసు మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తానని చెప్పారు. ప్రజల సూచనలను గౌరవించి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో చాపల వెంకటేశ్వర్లు, మాడిశెట్టి శ్రీనివాస్, పసుమర్తి హరి, వనమా వెంకటేశ్వర్లు, పోతుగంటి ప్రవీణ్, యర్రా నారాయణ రెడ్డి, కృష్ణ, సుబ్రహ్మణ్యం, తనూజ, శ్రీదేవి, పవిత్ర, లక్ష్మి, వాణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నలభై ఎనిమిది వార్డుల పౌరులకు అందుబాటులో ఉంటా – నివేదిత లక్షాది

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News