Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం అవుతా: రాజగోపాల్ రెడ్డి మరో సంచలనం

14-02-2026 175 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ.. మంత్రి పదవిపై హాట్ కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో తనకు మంత్రి పదవి వస్తుందని మంత్రి కాకపోతే ముఖ్యమంత్రి అవుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్ చేశారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థులతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనకు అడుక్కోవడం రాదని మర్యాదగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవ్వండని లేదంటే లాక్కునేదాకా చూసుకోవద్దంటూ ఘాటుగానే హెచ్చరించారు. తనకు ఇచ్చిన మాట ప్రకారం చేయండి లేదంటే డైరెక్ట్ నా టార్గెట్ అదే అంటూ ముఖ్యమంత్రి పదవిని ఉద్దేశించి అన్నారు. ఇకనుండి మునుగోడు నియోజకవర్గం ను (ప్రజలు) చూసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని నేను చూసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు. సమయం వచ్చినప్పుడు తెలంగాణలో ఇక జెండా ఎగరవేద్దామంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆయనవెంట మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, గెలుపొందిన నూతన కౌన్సిలర్లు ఉన్నారు.

Sthanikam

నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం అవుతా: రాజగోపాల్ రెడ్డి మరో సంచలనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News