Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:28 PM

నకిరేకల్‌లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం

15-05-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ మండల పరిధిలోని కందిమల్లెవారి గూడెంలో గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా అక్రమ ఇసుక దందా కొనసాగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే మట్టిని ఫిల్టర్ చేసి తీసిన ఇసుకను ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ట్రిప్‌కు రూ.6500 చొప్పున సరఫరా చేస్తున్నారని తెలిపారు.

నాణ్యతలేని ఇసుకను ఉపయోగించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి మైనింగ్ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా చర్యలు తీసుకుని అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Sthanikam

నకిరేకల్‌లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం

Article Image

నకిరేకల్ మండల పరిధిలోని కందిమల్లెవారి గూడెంలో గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా అక్రమ ఇసుక దందా కొనసాగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే మట్టిని ఫిల్టర్ చేసి తీసిన ఇసుకను ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ట్రిప్‌కు రూ.6500 చొప్పున సరఫరా చేస్తున్నారని తెలిపారు.

నాణ్యతలేని ఇసుకను ఉపయోగించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి మైనింగ్ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా చర్యలు తీసుకుని అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News