Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:13 PM

నకిరేకల్‌లో పిచ్చికుక్క బీభత్సం: నాలుగేళ్ల చిన్నారి ముఖంపై దాడి – ఆందోళనలో తల్లిదండ్రులు

03-04-2026 192 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో పిచ్చికుక్క స్వైర విహారం కలకలం రేపింది. వీధిలో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు శరత్ చంద్రపై ఆకస్మికంగా దాడి చేసిన కుక్క, అతని ముఖంపై తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం మేరకు, శరత్ చంద్ర ఇంటి ముందు ఆడుకుంటుండగా అకస్మాత్తుగా దూసుకొచ్చిన కుక్క అతనిపై దాడి చేసింది. ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో బాలుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఘటనను గమనించిన తాత, నానమ్మలు వెంటనే స్పందించి సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక చికిత్స అనంతరం బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో, వైద్యులు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో పలువురిని కరిచింది అని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకుని ఆ కుక్కను అదుపులోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనతో నకిరేకల్ ప్రాంతంలో భయం నెలకొంది. పిల్లలను బయటకు పంపడానికే తల్లిదండ్రులు జంకుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Sthanikam

నకిరేకల్‌లో పిచ్చికుక్క బీభత్సం: నాలుగేళ్ల చిన్నారి ముఖంపై దాడి – ఆందోళనలో తల్లిదండ్రులు

Article Image

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో పిచ్చికుక్క స్వైర విహారం కలకలం రేపింది. వీధిలో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు శరత్ చంద్రపై ఆకస్మికంగా దాడి చేసిన కుక్క, అతని ముఖంపై తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం మేరకు, శరత్ చంద్ర ఇంటి ముందు ఆడుకుంటుండగా అకస్మాత్తుగా దూసుకొచ్చిన కుక్క అతనిపై దాడి చేసింది. ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో బాలుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఘటనను గమనించిన తాత, నానమ్మలు వెంటనే స్పందించి సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక చికిత్స అనంతరం బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో, వైద్యులు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో పలువురిని కరిచింది అని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకుని ఆ కుక్కను అదుపులోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనతో నకిరేకల్ ప్రాంతంలో భయం నెలకొంది. పిల్లలను బయటకు పంపడానికే తల్లిదండ్రులు జంకుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News