Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:12 PM

నకిరేకల్‌లో జర్నలిస్ట్ రఘు అరెస్ట్

నకిరేకల్‌లో జర్నలిస్ట్ రఘు అరెస్ట్

నకిరేకల్‌లో జర్నలిస్ట్ రఘు అరెస్ట్
24-02-2026 430 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో పేద ప్రజల 1000కు పైగా గుడిసెల కూల్చివేత ఉద్రిక్తతలమధ్యకొనసాగుతుండగా, ఆ ప్రాంతానికి వెళ్తున్న సీనియర్ జర్నలిస్ట్ రఘును పోలీసులు నకిరేకల్‌లో అరెస్ట్ చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది.

ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల గ్రామంలో సుమారు 15 వేల మంది పోలీసుల భారీ బందోబస్తుతో జేసీబీల సహాయంతో గుడిసెల తొలగింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని అధికారుల వాదన కాగా, దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్న పేద కుటుంబాలను బలవంతంగా వెలివేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో పరిస్థితిని కవర్ చేయడానికి బయలుదేరిన జర్నలిస్ట్ రఘును నకిరేకల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా ఆ ప్రాంతానికి వెళ్తున్నారని, శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే జర్నలిస్టుల సంఘాలు ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలని వారు అభిప్రాయపడ్డారు.

వెలుగుమట్లలో కూల్చివేతల సమయంలో మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారులతో కలిసి బహిరంగ ప్రదేశాల్లో నిలబడి తమ నివాసాలను కాపాడాలని వేడుకున్నారు. కొంతమంది స్థానిక నాయకులను కూడా పోలీసులు గృహనిర్బంధంలో ఉంచినట్లు సమాచారం.ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి. పేదల పట్ల ప్రభుత్వ వైఖరి అన్యాయమని విమర్శించాయి. మరోవైపు, అధికార వర్గాలు మాత్రం న్యాయస్థానాల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు వివరణ ఇస్తున్నాయి.జర్నలిస్ట్ రఘు అరెస్టు నేపథ్యంలో మీడియా వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అతన్ని తక్షణం విడుదల చేయాలని జర్నలిస్టుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Sthanikam

నకిరేకల్‌లో జర్నలిస్ట్ రఘు అరెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News